వరంగల్ ప్రజబలం ప్రతినిధి జూన్ 21: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా చివరి రోజు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురష్కించుకొని హంటర్ కోడ్-హన్మకొండ లోని ది వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ బోర్డ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బిసి నేత హస్టల్ ప్రాంగణంలో ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు,మాజీ మంత్రివర్యులు,
తెలంగాణ గాంధీ,ఆచార్య కొండా లక్ష్మన్ బాపూజీ నిలువెత్తు విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి,
గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు,ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్,
నర్సంపేట,వర్దన్నపేట శాసన సభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి,ఆరూరి రమేష్,వర్దన్నపేట మాజీ శాసన సభ్యులు,ట్రస్ట్ చేర్మన్ వన్నాల శ్రీరాములు,హన్మకొండ కలెక్టర్ శ్రీమతి సిక్తా పట్నాయక్,కుడా చేర్మన్ సంఘంరెడ్డి సుందర్ రాజ్,నల్లబెల్లి జిల్లా పరిషత్ ప్రాదేశిక మెంబర్ శ్రీమతి పెద్ది స్వప్న,గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ కార్పోరేటర్ ఇంగే నాగేశ్వర్ రావు,తెలంగాణ ఆన్ లైన్ మీడియా వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి,ఢీంబాయ్ టీవీ న్యూస్ ఛానల్ సీఈవో వేముల సదానందం నేత పూలమాలలు వేసి వినమ్ర నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా కొండా లక్ష్మణ్ బాపూజీ అమర్ రహే!కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిద్దాం అంటూ నినాదాలు చేశారు.అనంతరం రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ట్రస్ట్ చేర్మన్,మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు శాలువ కప్పి సన్మానించారు.ఈ సందర్బంగా ఎంతో మంది పేద విద్యార్థులకు ఉచిత వసతి కలిపించి ఉన్నత విద్య అవలంబించడానికి దోహదపడుతున్న బిసీ నేత హస్టల్ విద్యార్థులకు కోసం యోగ సెంటర్,
గ్రంథాలయం రూమ్ నిర్మాణానికి నిధులు కెటాయించాలని వన్నాల శ్రీరాములు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దృష్టికి తీసుకెళ్లాగా అందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సానుకూలంగా స్పందించి కలెక్టర్ సిక్తా పట్నాయక్ కు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.