ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 10 (ప్రజాబలం) పొంగులేటి క్యాంప్ ఆఫీస్ ఇన్ చార్జి, జిల్లా కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మేనల్లుడు తుంబూరు దయాకర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఈరోజు పండితాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో డిసిసిబి డైరెక్టర్ పొంగులేటి ప్రధాన అనుచరుడు మేకల మల్లిబాబు యాదవ్, మేకపోతుల మహేష్ భారీ కేక్ కట్ చేసి దయాకర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండి మంత్రి గారి తరపున ఆందోళన పడవద్దు అని మనోధైర్యం, ఉత్సాహం కల్పిస్తూ, క్యాంప్ఆఫీస్ కే పరిమితం కాకుండా, శీనన్న సమయాను కూలంగా లేనప్పుడు గ్రామాలకు సైతం వెళ్లి కార్యకర్తల సమస్యను పరిష్కరిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటున్న దయాకర్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు తెలిపారు. క్యాంప్ ఆఫీస్ కి వచ్చి ప్రజలు చెప్పుకుంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు మంత్రిగారికి తెలియజేస్తూ, మా అందరి సమస్యలపరిష్కారానికి కృషి చేస్తున్న దయాకర్ రెడ్డి నిండు నూరేళ్లు చల్లగా జీవించాలని కార్యకర్తలు నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బానోతు నరసింహ నాయక్, మత్స్యశాఖ సొసైటీ అధ్యక్షుడు మేకల మల్లికార్జునరావు ఎల్ హెచ్ పి ఎస్ మండల అధ్యక్షులు భూక్యా నాగేంద్ర బాబు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు పాటిబండ్ల ప్రసాద్, మేకల మహేష్ బాబు, బండి ఉపేందర్, ధరావత్ హరిశ్చంద్ర, జక్కంపూడి వెంకటేశ్వర్లు బండి లక్ష్మీ నర్సు,మొగిలి శ్రీను బండి వీరన్న, జలగం శ్రీను పిచ్చయ్య, చల్ల మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు