ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తుoబూరు దయాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు

కాంగ్రెస్ శ్రేణులు, పొంగులేటి అభిమానుల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి10 (ప్రజాబలం) ఖమ్మం తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొoగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకుని శనివారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, పొంగులేటి అభిమానుల ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల సేవాకార్యక్రమాలు నిర్వహించారు. కేక్ కటింగ్ లు నిర్వహించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఖమ్మంలోని క్యాంప్ కార్యాలయంలో కేక్ ను కట్ చేశారు. ఆయా ప్రాంతాల్లోని వృద్దాశ్రమాలు, అనాథాశ్రమాలు, మానసిక వికలాంగుల కేంద్రాల్లో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. పలు చోట్ల పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ…. మంచితనం, కలుపుగోలు తనంతో అందరినీ సమన్వయం చేసుకునే తీరు దయాకర్ రెడ్డి సొంతమని కొనియాడారు. ప్రజలను అక్కున చేర్చుకునే ఆత్మీయ నేస్తంగా పొంగులేటి పక్షాన దయాకర్ రెడ్డి నిలవడం హర్షణీయమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బానోత్ మోహన్ అశోక్ నాయక్ బానోత్ భాస్కర్ మద్ది వీరారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పొంగులేటి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking