రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 10 ఫిబ్రవరి 2024:
వీ.ఆర్.ఫర్ సహయోగ్ చారిటబుల్ ట్రస్టు వారి ఆధ్వర్యంలో 11 రకాల పౌషకాహారాల మిశ్రమ ధాన్యాలతో తయారు గావించిన అల్పాహారాన్ని ట్రస్ట్ సభ్యులైన అందె లక్ష్మణ్ రావు, నరేశ్ ఎస్ పవర్ల ఆర్థిక సహయంతో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మణికొండలో పదవ తరగతి చదువుతున్న దరిదాపు 200 మంది విద్యార్థిని విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నిరంజన్ గారి సమక్షంలో సాయంత్ర సమయాన గత నాలుగు రోజులుగా ఇవ్వడమ్ జరుగుతున్నదని ట్రస్ట్ కన్వీనర్ నిర్మల్ చంద్ గొలేచ తెలియ పరచినారు మరియూ రాబోయే రోజులలో మార్చి 15 వరకు అపార్ట్మెంట్ సభ్యులు, కాలనీ నివాసులు, ప్రజా నాయకులూ ఎవరైనా వారి ఇష్ట ప్రకారమైన అల్పాహారాన్ని సమకూర్చి విద్యార్ధుల సౌకర్యార్ధం ముందుకు రావొచ్చని, ఎవ్వరూ ముందుకు రాని రోజులలో వీ.ఆర్.ఫర్ సహయోగ్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల సహాయ సహకారాలతో మంచి పోషక పదార్థాలతో కూడిన సాయంత్రపు తిను బండారాలను విద్యార్థిని విద్యార్థులకు అందించడానికి ప్రయత్నిస్తామని తెలియ జేసినారు. ఇట్టి సమయంలో ట్రస్టు సభ్యులు రచ్చా శ్రీనాథ్, నరొత్తం, స్కూల్ టీచర్లు ఆదిగా కార్యక్రమంలో పాల్గొని జయప్రదం గావించారు.