ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తూ భజరంగ్ సేన ఆందోళనకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా బజరంగ్ సేన రాష్ట్ర కార్యాలయంలో వాలైటెన్స్ డే కి వ్యతిరేకంగా పోస్టర్‌ను ఆవిష్కరించారు. తాము ప్రేమికులకు వ్యతిరేకం కాదని కార్పొరేటు సంస్థలు చేసే కార్యక్రమాలకే వ్యతిరేకమని పేర్కొన్నారు. పాశ్యాత్య దేశాల సంస్కృతికి యువత దూరంగా ఉండి.. దేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలని భజరంగ్ సేన నాయకులు కోరారు. ప్రేమకుల రోజు పేరుతో పబ్బులు , రిసార్ట్స్ లలో ఏర్పాటు చేసే కార్పొరేట్ సంస్థలు యువతను తప్పుదోవపట్టిస్తున్నారని అన్నారు. నగర వ్యాప్తంగా ఉన్న పార్కులు , పబ్బులు, కాఫీ షాప్?లు, హోటల్స్?లకు ప్రేమికులను అనుమతించొద్దని వినతి పత్రాలు ఇచ్చామని తెలిపారు. అయినా కూడా ప్రేమికులు బయటకి వస్తే ప్రతీ సంవత్సరం లాగానే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఫిబ్రవరి14న జరిగిన పుల్వామా దాడిలో 45 మంది వీర జవాన్లు అమరులయ్యారని వారిని స్మరిస్తూ యువత ప్రేమికుల రోజు వేడుకలను బహిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 14 ను వీర జవాన్ల దివాస్ గా జరుపుకోవాలని భజరంగ్ సేన నాయకులు విజ్ఞప్తి చేశారు. బజ్ రంగ్ సేన తెలంగాణ రాష్ట్ర అధ్య్షులు లక్ష్మణ్