రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 10 ఫిబ్రవరి 2024: మణికొండ పురపాలక సంఘంలో చైర్మన్ కస్తూరి నరేందర్ ఒంటెద్దు పోకడ వ్యవహార శైలిపై పార్టీలకతీతంగా కౌన్సిలర్ లందరూ ఒక తాటిపై వచ్చి గత నెల 30 న జరిగిన మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశంలో చైర్మన్ తో సహా 19 మంది హజరుకాగా 12 మంది సభ్యులు కౌన్సిల్ అజెండాను తిరస్కరించడమైనదని, గతంలో మొదటగా 10 మంది కౌన్సిలర్లు కలసి కట్టుగా కలక్టర్ ముందు ప్రవేశ పెట్టిన అవిశ్వాసానికి తోడుగా ఇట్టి అజెండా తిరస్కరణ రానున్న అవిశ్వాస తీర్మానానికి విజయ సంకేతమని, ఇప్పటికే మెజారిటీ కోల్పోయిన చైర్మన్ కస్తూరి నరేందర్ పదవీ విరమణ చేస్తే గౌరవ ప్రదంగా ఉంటుందని, అట్లా కాకుండా ప్రవేశ పెట్టిన అవిశ్వాస ప్రక్రియ మొదలయిన తరువాత కొద్దిమంది చైర్మన్ అనుకూల కౌన్సిలర్ల ద్వారా కౌన్సిలర్ల మధ్య పరస్పరంగా విడగొట్టి వారిపై బురద జల్లే కార్యక్రమం జరుగుతున్నదని, కాని ఎవరు దోపిడీ చేస్తున్నారో ఎవరు దోపిడీకి గురౌతున్నారో ప్రజానికానికి తెలుసని కావున ఒకటే ధ్యేయంగా పార్టీలకతీతంగా మణికొండ కౌన్సిల్ లో అవిశ్వాసం నెగ్గించు కోవడమే తమ కర్తవ్యమని 10 మంది సభ్యులు సంతకాలు చేసి పత్రికా ప్రకటన చేసినారు.