బి.ఎస్.పి నియోజకవర్గ ఇన్చార్జ్ వాసాల రామస్వామి.
హుజూరాబాద్ ప్రజా బలం ప్రతినిధి ఫిబ్రవరి 9
బి ఎస్ పి పార్టీ హుజురాబాద్ నియోజవర్గ అధ్యక్షులు
వాసాల రామస్వామి ఆద్వర్యంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశం నాయన మాట్లాడుతూ
ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పథకాన్ని అడ్డుకుంది ఎవరు అని ప్రశ్నించారు.
దళిత బంధు రొండవ విడత రాని బాధితుల తరుపున
బి ఎస్ పి పార్టీ వారికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటుందని,వీరికి సెకండ్ విడత రాకుండా అప్పటి ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఉన్న ప్రస్తుత హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బాద్యుడని ప్రజలను ఎమోషనల్ బ్లాక్ మేల్ చేస్తూ
ఓట్లు అయిపోయిన తరువాత నేనె ఇప్పిస్తానని రొండో విడతా రాని 4000 వేళ పై చిలుకు కుటుంబాలకు రాకుండా చేసినా ఎమ్మెల్యే, మీరు ఇవ్వాళ్ళ సంపినోడే సానుభూతి తెలుపుతూనట్టుగా ,దొంగే దొంగ అన్నట్టుగా ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఈ ప్రాంత ప్రజలకు హుజురాబాద్ అంబేద్కర్ సాక్షిగా దళిత సమాజానికి క్షమాపణ కోరాలని బీఎస్పీ పార్టీ నుండి డిమాండ్ చేశారు.ప్రజా ప్రభుత్వం అని చెప్పు కుంటున్న కాంగ్రేస్ నేడు ప్రజలకు వ్యతిరేకంగా
వ్యవహరిస్తూ. దళిత బంధు ఎకౌంట్స్ ను ఫ్రిజ్ చేసి దళిత సమాజాన్ని మానసికంగా ఆందోళనకు గురి చేస్తూ ఆత్మ హత్యలకు ప్రేరేపిస్తూ ప్రజలకు వెన్నుపోటు పొడుస్తుంది అన్నారు. ఈ విషయంపై ఈ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ చర్యలు తీసుకొని అధికారులను అదేశించవలసిందిగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో కలెక్టర్ట్ ను మంత్రి నిలయాన్ని బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ముట్టడిస్తామని హెచ్చరించారు.
దళిత సమాజం ఆందోళనకు గురై ఎలాంటి అగత్యాలు చేసుకోవద్దని,మీకు వచ్చేంతవరకు మన పార్టీ మేము అండగా ఉండి వారి పక్షాన పోరాడుతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మండల అధ్యక్షులు గిన్నారపు మహేందర్,జిల్లా అధ్యక్షుడు మేకల రవీందర్.
అసెంబ్లీ ఉపాధ్యక్షుడు మంద సమ్మన్న,ఇంచార్జ్ దోడ్డే శ్రీనివాస్ జిల్లా ఈసీ మెంబర్ పులాల నరేష్,
వీణవంక మండల అధ్యక్షులు కొంగల కుమార్ యాదవ్,
జమ్మికుంట మండల అధ్యక్షులు పంజల దిలీప్ గౌడ్,
హుజురాబాద్ మండల ఉపాధ్యక్షుడు మటూరి అజయ్ గౌడ్,ఉపాధ్యక్షుడు రేంజిత్.ముగల శేఖర్ మ్యాకమల్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.