హాజరైన సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు చిట్కుల మహిపాల్ రెడ్డి.
మనోహరాబాద్, మార్చి 9 (ప్రజా బలం న్యూస్ ):
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని పరికిబండ గ్రామంలో సోమవారం రోజు నుండి మల్లన్న జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం రోజున హోమాలు, మంగళవారం రోజున అగ్ని గుండాలు కార్యక్రమాలను నిర్వహించారు. మరియు చివరి రోజైన బుధవారం నాడు జాతర ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ జాతరలో వివిధ గ్రామాల నుండి ప్రజలు స్థానిక ప్రజలు పాల్గొని ఆ మల్లికార్జున స్వామి దీవెనలు పొందారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ మండల జెడ్పిటిసి రాణి సత్యనారాయణ గౌడ్, ఫ్యాక్స్ చైర్మన్ మెట్టు పైకిబాలకృష్ణారెడ్డి, సర్పంచ్ భగవాన్ రెడ్డి, జావేద్ పాషా, నరహరి, కొమురెల్లి, దినేష్, శ్రీకాంత్, రాజు, మల్లేష్, సత్యం గ్రామస్తులు , ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.