మంచిర్యాల మున్సిపాలిటీ సంర్వాగ సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 09 మంచిర్యాల మున్సిపాలిటీ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు స్పష్టం చేశారు.మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ….. పాత మంచిర్యాల నుండి తొలవాగు వరకు సెంట్రల్ లైటింగ్ సిస్టం,డ్రైనేజీ నిర్మాణం,రోడ్డు వెడల్పు నిర్మాణం చేపట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ 15 కోట్ల 14 లక్షల రూపాయల నిధులను మంజూరు చేసినట్టు ఆయన తెలిపారు.గత నెలలోనే మంచిర్యాల ప్రధాన నాలుగు కూడలలో డివైడర్ల నిర్మాణం చేపట్టేందుకు 27 కోట్లు మంజూరు అయినట్టు తెలిపారు.తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వాలు ఏనాడూ మున్సిపాలిటీలను పట్టించుకోవడంలేదని ఆరోపించారు.ఇంత అభివృద్ధి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై అసత్యపు ఆరోపణలు చేస్తూ తమ పబ్బం గడుపుకోవాలని ప్రతిపక్ష పార్టీలు చూస్తున్నాయని ఎద్దేవా చేశారు.ఎన్నో కోట్లు వెచ్చించి మున్సిపాలిటీలు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకులు ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు. ప్రజా శ్రేయస్సు కోసం మరిన్ని నిధులు వెచ్చించి మున్సిపాలిటీల అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య,పట్టణ కౌన్సిలర్లు, పిఎసిఎస్ చైర్మన్ ఫోరమ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సందెల వెంకటేష్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.