తన భర్త రాజును హత్య చేసింది మాలోత్ రాములు మృతిని భార్య హన్స

 

ప్రజాబలం దినపత్రిక
మెదక్ కొల్చారం మండలం
15.10.2024:

మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని తుక్య తాండకు చెందిన జరుపల రాజు గిరిజన యువకుడు మృతి చెందిన సంఘటనలో భాగంగా భార్య అంసి చెబుతున్న వివరాల ప్రకారం..
తన భర్తను ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో ఇంటి నుండి మాలోతు రాములు తీసుకెళ్లి మళ్ళీ వస్తా మంటూ చెప్పి తీసుకెళ్లినాడు. మధ్యాహ్నం వరకు తన భర్త రాకపోవడంతో మీరు ఎక్కడ ఉన్నారని భార్య హన్సి రాములు కుఫోన్ చేయగా జోగిపేట్ లోఉన్నామని చెప్పాడు. ఇలా చెప్పేసరికి తొందరగా రమ్మని నేను మాట్లాడడం జరిగింది.
ఎంతోసేపు ఎదురుచూసిన రాకపోయే సరికి మళ్ళీ నేను నాలుగు గంటల సమయంలో మాలోత్ రాములుకు ఫోన్ చేయడం చేశాను అని చెప్పిందిఈ సందర్భంగా మాలావత్ రాములు తోమాట్లాడగా
నేను ఒక కోటర్ మద్యం
నా డబ్బులతోనే తీసుకున్నానని ఇద్దరం కలిసి తాగామని అనంతరం చింతకుంట కళ్ళు దుకాణంలో కళ్ళు తాగుతున్నామని రాములు తెలిపారని అన్సి తెలియజేసింది. చాలాసేపు ఎదురుచూసిన అనంతరం మళ్లీ ఫోన్ చేయగా కళ్ళు దుకాణంలో పడుకొని లేస్తే లేడని నీళ్లు చెల్లిన కూడా లేవడం లేదని రాములు చెప్పడంతో రాజు భార్య అంసి ఆటో తీసుకొని చాముండేశ్వరి ఏరియాలోకి వెళ్ళగా వారే తనకు ఫోన్ చేసి మేమే వస్తున్నామని చెప్పినట్లుగా అన్సీ తెలియజేసింది. వంశి ఆటోలో చాముండేశ్వరి ఆలయం పరిసర ప్రాంతంలోఉండగా రాజును ఆటోలో వేసుకొని వాళ్లు రావడం జరిగింది అని
వారిని తీసుకొని మెదక్ ప్రభుత్వఆసుపత్రికి వెళ్లడం జరిగిందని రాజు పరిస్థితి బాగాలేదని స్థానిక ఆసుపత్రి డాక్టర్లు చెప్పగా గాంధీ హాస్పిటల్ కు తీసుకువెళ్లామని అక్కడ డాక్టర్ పరీక్షించి గ్లూకోస్ పెట్టిన పది నిమిషాల్లోపే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పడం జరిగింది.
సికింద్రాబాద్ ఆస్పత్రి నుంచి మృత దయాని తీసుకొచ్చిన అనంతరం తండాలోని ఏదైతే తన భర్తను తీసుకెళ్లినటువంటి రాములు ఇంటి వద్ద శవాన్ని ఉంచిన కుటుంబీకులు. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానిక ఎస్సై మమ్మద్ గౌస్ సిబ్బందితో రాత్రి రాత్రి అక్కడ గొడవ జరగకుండా వచ్చి తాండకు సంబంధించినటువంటి తాజామాజీ సర్పంచ్, ఎంపిటిసి మరియు తాండ పెద్దలు అందరు కలిసి ఎస్సైతో వాగ్వాదానికి దిగడం జరిగింది. ఎస్సై వారితో మాట్లాడుతూ తాను జోగిపేట సి ఐ ని ఫోన్లో తెలుసుకోవడం జరిగిందని విషయం గురించి ఇంటి నుంచి తీసుకెళ్లిన రాములు పైన కేసు చేసి జైలుకు పంపించడం జరుగుతుందని చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
ఈ సందర్భంగా రాజు భార్య అంశి మాట్లాడుతూ తన భర్తను కొట్టి చంపడమే
కాకుండా అతనిపైన యాసిడ్ పూసినట్లుగా తమ కులస్తులు తనకు చెప్పింది వాస్తవమేనని తన ఇంటి నుంచి ఉదయం తీసుకుపోయిన మాలవత్ రాములు పై కేసు నమోదు చేసి తన కుటుంబానికి అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా న్యాయం చేయాలని పోలీసు వారిని కోరడం జరిగింది ఆమెకు సంతానం ఒక పాప ఒక బాబు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking