హైదరాబాద్ ఆగష్టు 31 ();రంగారెడ్డి జిల్లా, షాద్ నగర్ నియోజకవర్గం పరిధిలోని పెంజర్ల గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు మామిడి భీమ్ రెడ్డి రాఖీ పండుగ పర్వదినాన తన చిన్న నాటి స్నేహితుడు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ఫిల్మ్ నగర్ లోని రేవంత్ రెడ్డి స్వగృహంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. చిన్న తనం నుంచి పట్టుదలతో, రాజకీయాల లో అంచెలంచెలుగా పిసిసి అధ్యక్షులు గా ఎదిగిన మీ తీరు ఆదర్శం అని, నా స్నేహితుడు గా మీ ఆకాంక్ష నెరవేరాలని కోరారు. అతని వెంట షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చంది తిరుపతి రెడ్డి మరియు జవహర్ బాల్ మంచ్ రాష్ట్ర చైర్మన్ రిషికేశ్ రెడ్డి ఉన్నారు.