హైదరాబాద్ ఆగష్టు 31::మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ కమిటీని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.ఈ కమిటీలో పాతబస్తీ లాల్ దర్వాజా ప్రాంతానికి చెందిన చార్మినార్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, బీసీ మేరు సామజిక వర్గానికి చెందిన కె.వెంకటేష్ ను నియమించారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత బీసీ వర్గాలకు అమలు చేయాల్సిన పధకాలు చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించిన సూచనలు సిఫార్సులను ఈ కమిటీ చేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.కమిటీలో తనకు సభ్యునిగా అవకాశం కల్పించిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కి,వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేష్ కుమార్ గౌడ్ కు వెంకటేష్ కృతఙ్ఞతలు తెలిపారు.