జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి జూలై 5
జమ్మికుంట మండలం మాచినపల్లి గ్రామానికి చెందిన బండ శ్రీనివాస్ 50 సంవత్సరాలు అనే వ్యక్తి శుక్రవారం మధ్యాహ్నం కాజీపేట నుండి మంచిర్యాల వైపు వెళ్లే దానాపూర్ ఎక్స్ ప్రెస్.
జమ్మికుంట రైల్వే స్టేషన్లో ఒకటో నెంబర్ ప్లాట్ ఫామ్ పై వచ్చి కదులుతున్న సమయంలో ట్రైన్ నుండి జారీ క్రింద పడి చనిపోయాడు విషయం గమనించిన స్టేషన్ మాస్టర్ జమ్మికుంట 108 అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించగా వెంటనే అక్కడికి చేరుకున్న జమ్మికుంట108 అంబులెన్స్ సిబ్బంది వెళ్లి చూడగా.తలకు బలమైన గాయం అయినందున మరణించాడని నిర్ధారించారు. అక్కడే ఉన్న ఆర్ పి ఎఫ్ పోలీస్ కానిస్టేబుల్ రైల్వే పోలీసులకు సమాచారం అందించి మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.