ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ మార్చి 08 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము విద్యా శాఖ మంచిర్యాల నియోజకవర్గం మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు (రాజీవ్ నగర్) లో ఉన్న కస్తూరీభా గాంధీ బాలికల విద్యాలయంలో అదనపు తరగతి గదులను ప్రారంభించిన మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కి ఘన స్వాగతం పలికిన ఉపాధ్యాయులు, విద్యార్థులు,వార్డు ప్రజలు.
అనంతరం ఎమ్మెల్యే గారిని శాలువాతో సన్మానించిన ఉపాధ్యాయులు.ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.