లక్షెట్టిపేటలో పాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 11 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు శంకుస్థాపన చేశారు.లక్షెట్టిపేటలో మున్సిపాలిటీ లో 22 కోట్ల రూపాయల వ్యయంతో అమృత్ నీటి సరఫరా పైపు లైన్,ట్యాన్క్ నిర్మాణం పనులను ప్రారంభించారు.అనంతరం 15 వార్డ్ లలో 50 లక్షలతో సీసీ రోడ్ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం ఇటీవల అగ్ని ప్రమాదం గురైన లక్షెట్టిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల కు నూతన భవనానికి 2 కోట్ల 38 లక్షల పనికి శంకుస్థాపన చేశారు.తర్వాత ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ… ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నట్లు,అమృత్ నీటి సరఫరా ద్వారా తాగునీరు సరఫరా జరుగుతుందని అన్నారు.నూతన పాఠశాల బిల్డింగ్ శంకుస్థాపన చేయడం చాలా ఆనందం ఉంది అని లక్షెట్టిపేట పట్టణ ప్రజలను నేను ఎప్పుడు మారువలేను అని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్లా నాగభూషణం, మున్సిపల్ కమిషనర్ రాజా శేఖర్,డీసీసీ ఉపాధ్యక్షుడు చింత అశోక్ కుమార్,పట్టణ అధ్యక్షుడు అరిఫ్,మండల అధ్యక్షుడు పింగళి రమేష్,కౌన్సిలర్ సురేష్ నాయక్,ఉమాదేవి-కిరణ్, రాందేని వెంకటేష్,చింత సువర్ణ,కో ఆప్షన్ మెంబెర్స్ సయ్యద్ షాహిద్ అలీ,చిన్న రమేష్,బాణాల రమేష్,బియ్యల తిరుపతి, అంకతి శ్రీనివాస్,కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking