కోటి 59 లక్షల నిధులతో నూతన భవన నిర్మాణం పనులకు భూమి పూజ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 11 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని గూడెం ఎత్తిపోతల పథకంలో నీటిపారుదల శాఖ కోటి 59 లక్షల నిధులతో నూతన భవన నిర్మాణం పనులకు భూమి పూజ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తదనంతరం మాట్లాడుతూ… వర్షాకాలంలో వరదలు వచ్చినప్పుడు ఎత్తి పోతల పతకం మునిగి దాంట్లో ఉన్న బ్యట్రీస్ కానీ మళ్ళీ ఇతర ఎలక్ట్రానిక్ సమన్లు కరబ్ అవడం జరుగుతుంది అని తెలిసిందే,అందుకు ఇబ్బంది కలుగకుండా జి ప్లస్ బిల్డింగ్ కు శంకుస్థాపన చేసి వాటిని ఫస్ట్1 ఫ్లోర్ లో ఉంచుతే అవి మళ్ళీ ఇబ్బంది కావద్దు అని కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వం అని రైతుల కు ఏలాంటి ఇబ్బంది కలుగకుండా చూడడమే ఈ ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు,ఎంపీపీ గడ్డం శ్రీనివాస్,జడ్పీటీసీ గడ్డం నాగమణి -త్రిమూర్తి,గుడెం ఎంపీటీసీ తోట మోహన్, ముత్యాల శ్రీనివాస్,కొంగ నవీన్, దండెపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అక్కల వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు ముధ్దసాని వేణు,ముత్తె వెంకటేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking