గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి:సోమవారంనాడు ప్రజావాణిలో డిప్యూటీ మేయర్ శ్రీమతి. శ్రీలత మోతె శోభన్ రెడ్డి గోషామహల్ నియోజకవర్గం లోని 6డివిజన్ లలో వున్నా ట్రాన్స్ఫార్మర్ ల చుట్టూ ఫెన్సెయింగ్ ఏర్పాటు తో పాటు ట్రాన్స్ఫార్మర్ దెగ్గర చెత్త వేయకుండా గట్టి చర్యలు తీసుకొని ట్రాన్స్ఫార్మర్ కాలి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజల కు హాని జరగొద్దు అని వారి ఇంటిల్లోని ఎలక్ట్రానిక్ పరికరాలు షార్ట్ సర్క్యూట్ కు లోను కాకుండా జాగ్రత్తలు తీసువాలని. మరియు బేగంబజార్ డివిజన్ లోని ముస్లిం జంగఫుల్ గోశాల వద్ద వైకుంఠ ధామం హిందూ స్మశాన వాటికను ఏర్పాటు చేయాలనీ కోరిన వెంటనే సంబంధిత విద్యుత్ అధికారులతో మరియు స్మశాన వాటిక కోసం సంబంధించిన ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకోవాలి అని ఆదేశించారు.

గోషామహల్ నియోజకవర్గం డెవలప్మెంట్ ఫోరమ్ తరఫున బద్దం సతీష్ గౌడ్.మరియు ఏఐసీసీ ఓబీ సి విభాగం జాతీయ జాయింట్ కో ఆర్డినేటర్ నిర్మల్ కుమార్ యాదవ్. జైదీప్ యాదవ్. రాధా కృష్ణ. అశోక్. నరేందర్. చెందు. లోహిత్. గాలి గణేష్ తదితరులు పాల్గొన్నారు.అనంతరం గౌరవ డిప్యూటీ కమీషనర్ గోషామహల్ సర్కిల్ 14 ని కూడా కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.