వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 19 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని కొత్తూరు,వెంకట్రావుపేట,దౌడేపల్లి,పాతకొమ్ముగూడెం,కొత్తకొమ్ముగూడెం,చందారం గ్రామాల్లో మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు వరి కొనుగోలు కేంద్రాలను బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని.రైతులందరూ దళారులను నమ్మి మోసపోకుండా సొసైటీ ఆధ్వర్యంలో ప్రారంభించిన రైతు కొనుగోలు కేంద్రాల్లో ఉపయోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య, మాజీ డిసిఎంఎస్ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి,అప్పటి లింగన్న,నాయకులు అంకతి గంగాధర్,తిప్పని చంద్రమౌళి,జాప్రతినిధులు, ముఖ్యనాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking