మతాలకు అతీతంగా దేశంలోనే గర్వించదగిన కార్యక్రమం డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 19 :
రంజాన్ కి తోఫా లు, బతుకమ్మ కి చీరలు, క్రిస్మస్ కి చీరల పంపిణీ కార్యక్రమం మతాలకు అతీతంగా దేశంలోనే గర్వించదగ్గ కార్యక్రమమని డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు అన్నారు.బుధవారం పట్టణంలోని స్థానిక విశ్రాంతి భవనంలో ముస్లిం మైనారిటీ లకు రంజాన్ సందర్బంగా కొక్కిరాల రఘుపతి రావు ట్రస్ట్ ఆధ్వర్యంలో తోఫా ల పంపిణికై ముఖ్య అతిధిగా విచ్చేసి తోఫా(కిట్ ) లు పంపిణీ చేశారు.ఈ సందర్బంగా డిసిసి అధ్యక్షురాలు మాట్లాడుతూ… గత ఎన్నికల్లో ప్రతి ఆడబిడ్డని తన ఇంటి ఆడబిడ్డలా భావిస్తూ కుల,మత బేధాలు లేకుండా అందరికి అన్నలాగా తోడుంటమని,ప్రతి పండుగకి మొదటి కానుక నా ఇంటి నుండి వస్తుందని ఎన్నికల్లో మాట ఇచ్చింది మొదలు ఓడిపోయినా కానీ కలత చెందక అందరిని సమానంగా చూస్తున్న మనసున్న మహారాజు మన నాయకుడు ప్రేమ్ సాగర్ రావు అని కొనియాడారు.ఇప్పటికైనా ప్రజలు అలోచించి ప్రజా సేవకి అర్హులైన ప్రేమ్ సాగర్ రావు ని వచ్చే ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపించగలరని అన్నారు.దేశం లోనే ఎవరు చేయని కార్యక్రమం మన రాష్ట్రంలో మన మంచిర్యాల నియోజకవర్గం లో ప్రేమ్ సాగర్ రావు అధ్యక్షతన జరగడం గర్వించదగిన విషయం అన్నారు. అనంతరం సుమారు 900 తోఫా (కిట్ ) లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమం లో పట్టణాధ్యక్షుడు ఆరిఫ్,మండల అధ్యక్షుడు పింగళి రమేష్,బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నలిమెల రాజు,కౌన్సిలర్లు,మండల యుత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంకతి శ్రీనివాస్,సివియర్ నాయకురాలు అక్కల శకుంతల,కార్యకర్తలు,పెద్ద ఎత్తున ముస్లిం సోదరీమణులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking