ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 19 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేటలో రక్త దానం శిబిరంలో కర్త దానం మహా దానం అని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు.బుధవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ లోని రైతు వేదికలో తెలంగాణ రెవిన్యూ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ మంచిర్యాల ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ రక్త నిల్వ కేంద్రం (బ్లడ్ బాంక్) ద్వారా రక్తదాన శిబిరనికి ముఖ్యఅతిథిగా విచ్చేసి జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ప్రారంభించారు.రక్త దానం చేసిన వ్యక్తులను అభినందించారు.ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ మాట్లాడుతూ…తెలంగాణ రెవిన్యూ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్త దానం చేసిన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.రక్త దానం చేయడం అంటే గొప్ప పని చేసినట్లు అని గుర్తించాలని అన్నారు.రక్తం దొరకక చాలా ప్రాణాలు పోతున్నాయన్నారు.కావున ప్రతి ఒక్కరూ రక్త దానం చేయడం వలన చాలా మంది ప్రాణాలు కాపాడినవారిగా నిలుస్తామన్నారు. రక్తదానం గొప్ప సహాయంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు 40 మంది రక్తదానం చేయడం జరిగిందన్నారు.ఈ రక్తం స్వీకరించిన వ్యక్తికి రక్త దానం చేసిన వ్యక్తితో అనుకోకుండా రక్త సబంధం ఏర్పడుతుందని ఆయన చెప్పారు.అనంతరం తాసిల్దార్ జోష్ణ మాట్లాడుతూ…ఈ రక్తదాన శిబిరానికి యువత పెద్ద ఎత్తున రక్త దానం చేయుటకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.జిల్లాలో రక్త నిల్వలు తక్కువగా ఉన్నాయని,ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన వ్యక్తిగా రక్త దానం చేసి జిల్లా వాసుల ప్రాణాలు కాపాడుటకు ముందుకు రావాలని కోరారు.రక్తం అవసరమైన వారిలో మన కుటుంబ సభ్యులు,బంధువులు, స్నేహితులు కూడా ఉంటారని పేర్కొన్నారు.అన్ని దానాలలోకి రక్త దానం గొప్పదని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నాగేశ్వర్ రెడ్డి,ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఇన్చార్జ్ మహేందర్,ఏ ఓ ప్రభాకర్ రెడ్డి, రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.