ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 19 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండల కేంద్రంలో గత 17 రోజుల నుండి సమ్మె చేస్తున్న ఐకెపి వివో ఏ లకు మద్దతుగా దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపిన డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు.ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షురాలు మాట్లాడుతూ… గ్రామాల్లో మహిళా అభ్యున్నతి కోసం అలాగే ప్రభుత్వం చేపట్టే వివిధ కార్యక్రమాల్లో విఓఏ లది కీలక పాత్ర అని అన్నారు ఇంత సేవా కార్యక్రమాలు చేస్తున్న వారికి 3900 రూపాయల గౌరవ వేతనాన్ని ఇవ్వడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం అని అన్నారు వీరికి గౌరవ వేదనం కాకుండా కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వీరికి ఉద్యోగ భద్రత కల్పిస్తూ జీతాలు పెంచుతామని అన్నారు,మద్దతుగా నిలిచిన సురేఖ ప్రేమ్ సాగర్ రావు కి దండేపల్లి మండల పార్టీ కాంగ్రెస్ నాయకులకు వివోఏ లు ధన్యవాదాలు తెలిపినారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని మద్దతుగా నిలిచినారు.