మంచిర్యాల పురపాలక సంఘం కౌన్సిలర్స్ కలెక్టర్ కు వినతి పత్రం

చైర్మన్,వైస్ ఛైర్మన్ లపై అవిశ్వాసంకు కాంగ్రెస్ నోటీసు

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి డిసెంబర్ 15 : మంచిర్యాల పురపాలక సంఘం బీఆర్ఎస్ పార్టీకి చెందిన చైర్మన్ పెంట రాజయ్య,వైస్ చైర్మన్ గాజుల ముకేశ్ గౌడ్ లపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ లు కలెక్టర్ బదావత్ సంతోష్ కు నోటీసు అందజేశారు.శుక్రవారం 26 మంది కౌన్సిలర్ లు కలెక్టర్ కార్యాలయం కు ప్రత్యేక బస్ లో వెళ్లారు.కలెక్టర్ ను కలిసి సంతకాలతో కూడిన వినతిపత్రం ను సమర్పించారు.అవిశ్వాసం కు అవసరమైన కౌన్సిలర్ ల సంఖ్యాబలం తమకు ఉందని కాంగ్రెస్ పక్ష నాయకుడు రావుల ఉప్పలయ్యా,ఉప నాయకుడు వేములపళ్ళు సంజీవ్ కలెక్టర్ కు తెలిపారు. మెజార్టీ సభ్యులు ఉన్నందున చైర్మన్ పెంట రాజయ్య,వైస్ చైర్మన్ గాజుల ముకేశ్ గౌడ్ లపై అవిశ్వాసం కోసం సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు.కలెక్టర్ 15 రోజుల్లో సంతకాలు చేసిన కౌన్సిలర్ వివరాలను విచారిస్తారు.ఆతరువాత ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అవిశ్వాసం తీర్మానంకు అవకాశం ఇస్తారు.అయితే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గెలుపొందడంతో బీఆర్ఎస్ కౌన్సిలర్ లు 17 మంది కౌన్సిలర్ లు కాంగ్రెస్ లో చేరారు ఐదుగురిని అప్పట్లో మాజీ ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు బీఆర్ఎస్ లో చేర్చుకోగా తాజాగా ప్రేమ్ సాగర్ రావు ఏకంగా 17 మందిని కాంగ్రెసులో చేర్చుకుని దివాకర్ రావుకు అవిశ్వాసం అనే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు.అవిశ్వాసం కు అవసరమైన సంఖ్యాబలం పెరగడంతో క్యాంపు రాజకీయాలకు అవసరం లేకుండాపోయింది.చైర్మన్, వైస్ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టనున్న ట్లు ఉప్పలయ్యా తెలిపారు.ఈ కార్యక్రమంలో ముందటి సత్తమ్మ,సల్ల మహేష్,ఎస్.కె అబ్దుల్ మాజీద్,జోగుల శ్రీలత,సల్ల తార,నల్ల శంకర్,పోరేడ్డి రాజయ్య,పుధరి సునీత, వంగపల్లి అనిత,కొండ పద్మ, మెరుగు మహేశ్వరి,రామగిరి బాణేష్,వేములపల్లి సంజీవ్, మీనాజుద్దీన్,నాంపల్లి మాధవి,సిరికొండ పద్మ, పాలపు సాయి భార్గవి,చైతన్య రెడ్డి, రావుల ఉప్పలయ్య,జగ్గారి సుమతి,శెట్టి సత్యనారాయణ, ఆఫ్ఇన్ సుల్తానా,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తుమ్మల నరేష్,సీనియర్ నాయకులు,మున్సిపల్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking