ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 24 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట విద్యార్థి సంఘంగా విద్యాశాఖ అధికారులకు పలుసార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పుడు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం రోజున కొంత మంది ఫిర్యాదుల మేరకు అనుమతి లేకుండా లక్షెట్టిపేట పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో 8వ,9వ తరగతులు అనుమతులు లేకుండా నడుపుతున్నట్లు సమాచారము తెలిసిన వెంటనే విద్యాశాఖ అధికారి రవీందర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఆరెండు గదులను సీజ్ చేసి రావడం జరిగినది.అనుమతులు వచ్చేవరకు ఎట్టి పరిస్థితుల్లో నడపరాలని తీవ్రంగా సంబంధిత మేనేజ్మెంట్ వాళ్ళు హెచ్చరించడమైనది. సమాచారం అందించడమైనది.