ప్రజాబలం ప్రతినిధి ఉప్పల్ ఆగస్టు 24:
డెక్కన్ స్ప్రింగ్ గ్లోబల్ స్కూల్ కి చెందిన విద్యార్థులు 35వ జాతీయ కరాటే ఛాంపియన్షిప్ లో తమదైన ముద్ర వేశారు. సరూర్ నగర్ స్టేడియం లో నిర్వహించిన జాతీయ కరాటే పోటీలలో ఐదుగురు విద్యార్థులు అక్కినేని యువన్, నితీష్ చౌదరి, నల్లా లక్ష్మి ఆరాధ్య, ఆయుష్ నల్లా, అక్కినేని సారా లు బంగారు పతకాలు సాధించగా, చందన్ అనే విద్యార్థి రజతం, ఇద్దరు విద్యార్థులు కార్తీక, ప్రణవ్ లు కాంస్య పతకాలు సాధించారు. కరాటే పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల చైర్మన్ నవనీత రావు, ప్రిన్సిపల్ సుమా మీనన్ లు అభినందించారు. విద్యార్థుల కృషి, పట్టుదల తో విజయం సాధించారన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.