ప్రచారాన్ని హోరెత్తించిన మణికొండ బీ.ఆర్.ఎస్ కార్యకర్తలు

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 02 మే 2024:

చేవెళ్ల పార్లమెంట్ బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం లోని మణికొండలో పలు కాలనీలలో ఓటర్ మహాశయులను కలసి వారి యొక్క అమూల్యమైన ఓటును బ్యాల్లెట్లో 1వ నంబర్ వద్ద గల కార్ గుర్తు బటన్ పై నొక్కి అందరికి ఎల్లవేళలా అందుబాటులో ఉండే బీ.సీ బిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ కు ఓటు వేసి ఆశీర్వదించి పార్లమెంట్ కు పంపాలని మణికొండ మున్సిపాలిటీ గులాబీ శ్రేణులు ఇంటింటికి, గడప గడపకు ప్రచారం నిర్వహించినారు, ఈ సందర్భంగా బీ.ఆర్.ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ రామకృష్ణ రెడ్డి, మాజీ ఎం.పీ.పీ తలారి మల్లేశ్, పార్టీ అధ్యక్షుడు బుద్దోల్ శ్రీరాములు, కౌన్సిలర్లు ఆలస్యం నవీన్ కుమార్, బుద్దోల్ కావ్య శ్రీరాములు, శైలజా వినోద్, మహిళా అధ్యక్షురాలు రూపా రెడ్డి, మైనారిటీ నాయకుడు బషీర్, స్థానిక సీనియర్ నాయకులు కుంబగల్ల ధనరాజ్, జైరాజ్ లతో పాటు అందె లక్షమన్ రావు, నరేందర్ అనేక మంది పాల్గొని ప్రచారాన్ని నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం జేసినారు.

   

Leave A Reply

Your email address will not be published.

Breaking