రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ను కలసిన మణికొండ బీ.ఆర్.ఎస్ నాయకులు.

రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 13 ఫిబ్రవరి 2025
మణికొండ భారత రాష్ట్ర సమితి పార్టీ తరపున అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ ఆద్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డిని కలిసి స్తానిక సమస్యలపై వినతి పత్రం సమర్పించడం జరిగింది, అందులో పుప్పాలగూడ గ్రామంలో గవర్నమెంట్ స్కూల్ పక్కన 2019 లో రూపాయలు 45 లక్షల బడ్జెట్ తో బాబాసాహెబ్ అంబేద్కర్ భవనాన్ని నిర్మించాలని శంకుస్థాపన చేయడం జరిగింది,కానీ ఇంతవరకు ఆ భవన నిర్మాణ విషయం గూర్చి ప్రస్తావించక పోవడం గమనించ తగ్గ విషయమని, ప్రస్తుతం 75 వ రాజ్యాంగ నిర్మాణ సంవత్సరం కావడం సందర్భంగా అంబేద్కర్ భవన నిర్మాణ గురించి ఏ రకమైన చర్యలు చేపట్టకపోవడం శోచనీయం. ఈ సందర్భంగా పుప్పాలగూడ గ్రామ ప్రజల సంతకాల సేకరణ గావించి కలెక్టర్ కి సమర్పించడం జరిగింది. అంతే కాకుండా గతంలో పుప్పాలగూడ గ్రామం నుంచి ఊరికి సంబంధించిన స్మశాన వాటికకు రహదారిని పునర్నిర్మించాలని ఇప్పుడున్న బిల్డర్ల ఆర్.ఎం.సి ప్లాంట్ ను తొలగించాలని కోరడమైనది. ముస్లింల స్మశాన వాటికకు నెక్నాంపూర్ గ్రామంలో స్థలం కేటాయించాలని కోరిన సందర్భంగా దాదాపు సంవత్సరం క్రితం సర్వే చేసి రిపోర్టు దాఖలు చేయమని ఎమ్మార్వో గండిపేటకి సూచించినప్పటికీ ఈరోజు వరకు సర్వేయర్ లేడు అన్న నెపంతో కాలయాపన జరుగుతున్నది. కొన్ని వేలమంది ముస్లిం సోదరులకు ఉపయోగపడే స్మశాన వాటికకు వెంటనే స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేయడం జరిగినది. రాజ్యాంగ నిర్మాణం జరిగి 75 వ సంవత్సరం పురస్కరించుకొని పుప్పాలగూడ గ్రామంలో మరియు తానాషా నగర్ హుడా కాలనీ పార్క్ వద్ద అంబేద్కర్ విగ్రహాలను ప్రతిష్టించుట కొరకు అనుమతి కోరడమైనది. ఇట్టి కార్యక్రమంలో సీతారాం ధూళిపాళ, కుంభగల్ల ధనరాజ్, గుట్టమీది నరేంద్ర, అందె లక్ష్మణ్ రావు, ఉపేంద్రనాధ్ రెడ్డి, సంగం శ్రీకాంత్, రామ సుబ్బారెడ్డి, సుమన్, భాను చందర్, ఆరీఫ్ మొహమ్మద్, సుమ నళిని, ఉసేన్, అశ్వక్ అలీ, మణి, బొడ్డు శ్రీధర్, తిరుపతి, శేఖర్ తది తరులు పాల్గొన్నారు.

   

Leave A Reply

Your email address will not be published.

Breaking