కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ,ఇతర ముఖ్య నాయకులతో కలిసి మీడియా సమావేశంలో
మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్ ప్రజాబలం ప్రతినిధి:దేశంలోనే అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకత్వం వహించే విధంగా రోల్ మోడల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉఉఉద్యోగి ని పంపి ఒక కోటి 15 లక్షల కుటుంబాలకు కోటి 12 లక్షల కుటుంబాల్లో సమాచారం స్వచ్ఛందంగా ఇచ్చారు
150 కుటుంబాలకు ఒక గ్రూపింగ్ గా చేయడం జరిగింది
పదిమంది ఎన్యూమరేటర్లకు ఒక పరిశీలకుడిని పెట్టి మండల స్థాయి రాష్ట్రస్థాయి లో ఈ ప్రక్రియ కొనసాగింది
చాలా పకడ్బందీగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అటు సిఎస్ ఇతర ప్లానింగ్ డిపార్ట్మెంట్ అధికారులు ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఈ ప్రక్రియనంత సజావుగా, ట్రాన్స్పరెంట్ గా జరిగేలా చర్యలు తీసుకోవడం జరిగింది
దాదాపు 3.1 శాతం లో కొంత మంది తమ సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్త చేయడం జరిగింది
వారి కూడా అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది
ఫిబ్రవరి 16 నుండి 28వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా ఇంకా సమాచారం ఇవ్వని 3.1 శాతం ప్రజలు దీనిని ఉపయోగించుకోవాలి
కొంతమంది బిఆర్‌ఎస్ నేతలు రీ సర్వే జరుగుతుంది అంటున్నారు
ఇది రీ సర్వే కాదు ఎవరైతే సర్వేలో మిస్సయ్యారు సర్వేలో సమాచారం ఇవ్వలేధో వారు సమాచారం ఇవ్వడానికి మరొక అవకాశం ఇవ్వడం జరిగింది
మార్చ్ మొదటి వారంలో క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి… క్యాబినెట్ సమావేశం తర్వాత ప్రత్యేక శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది
42 శాతం స్థానిక సంస్థల్లో, విద్యా, ఉపాధి అవకాశాల్లో బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలని సంకల్పంతో చట్టబద్ధత తెచ్చే కార్యాచరణ తీసుకున్నాం..
దీనికి అందరూ సహకరించాలి
ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటే మాట్లాడడానికి హక్కు ఉంటుంది
బిఆర్‌ఎస్ పార్టీ అగ్రనాయకత్వం ఎవరు కూడా ఈ సర్వేలో పాల్గొనకుండా దానిని విమర్శలకు పరిమితం చేస్తున్నారు..
వారి మానసిక స్థితి బలహీన వర్గాలను ఏ విధంగా అణిచివేయాలని స్పష్టంగా కనిపిస్తుంది
మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి
ప్రజలందరికీ మీ పార్టీ తరపున విజ్ఞప్తి చేయండి
ఎక్కడెక్కడ మిస్సయ్యారో ప్రజలందరికీ మీ పార్టీ తరపున సర్వేలో పాల్గొనాలని విజ్ఞప్తి చేయండి
గత సర్వేలో మిస్ అయిన వారు మీ సమాచారాన్ని ఇవ్వండి
తెలంగాణ జనాభా లెక్కల్లో పౌర సభ్యుల్లో సభ్యులుగా ఉండి అవకాశాన్ని కోల్పోకుండా ఉండండి
బీజేపీ ఇది వ్యాపారస్తుల పార్టీ
వారికి కుల గణన జరగడం ఇష్టం లేదు
వారికి 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేదు
వారికి జనాభా కి అనుగుణంగా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేదు
అందుకే వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం పక్షాన సుప్రీంకోర్టులో అపిడవిట్ దాఖలు చేశారు
మేము దానికి వ్యతిరేకం ఇది అసాధ్యమని
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రక్రియ దేశవ్యాప్తంగా ప్రకంపనలు కలిగించి మా నాయకుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో బడ్జెట్ సమావేశంలో దీనిని ఆమోదింప చేసుకొని కాంగ్రెస్ కు ఉన్న 100 మంది పార్లమెంట్ సభ్యులతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రధానమంత్రి కేంద్ర మంత్రులతో సహా అన్ని రాజకీయ పార్టీలను కలిసి తమిళనాడులో మాదిరి 69 శాతం రిజర్వేషన్లు ఎలా ఉపయోగిస్తున్నారో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రిజర్వేషన్ల పెంపు బాధ్యత కేంద్ర ప్రభుత్వానిధి
రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధంగా శాసనసభలో సభ అభిప్రాయంతో పాటు తీర్మానాన్ని ప్రవేశపెడతాం
స్థానిక సంస్థలు ఎన్నికలు వాయిదా పడడం వల్ల కేంద్రం నుండి నిధులు రావో ఆ నిధులను కూడా తెలంగాణ ప్రభుత్వం భరించి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు కలగాకుండా చూడాలని ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది
స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని కేంద్రం నుండి వచ్చే నిధులు తెచ్చుకోవాలని తపన
మరోవైపు కులగనన జరిగిన తర్వాత బీసీ సంఘాల నాయకులను ప్రభుత్వం తరఫున పిలిచి చర్చించాం
వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నాం..
వారు స్పష్టంగా వారి అభిప్రాయాలు చెప్పారు
కుల సర్వేలో మిస్సయిన వారికి అవకాశం ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు
కుల సంఘాలు బీసీ సంఘాలు మేధావులు రిటైర్డ్ ఐఏఎస్ ప్రొఫెసర్లు విజ్ఞప్తి చేస్తున్న ఈరోజు చారిత్రాత్మక నిర్ణయం జరిగింది
ఏం నిర్ణయం అమలు అయ్యేదాకా మీరంతా వెంట ఉండి అన్ని రాజకీయ పార్టీల దగ్గర ఉండి ఈ కార్యక్రమం సజావుగా అమలు వెంట ఉండాలని అయ్యేలా కోరుతున్న
సర్వేలో పాల్గొనేవారు అందరూ సర్వేలో పాల్గొనే విధంగా బీసీ సంఘాలు ప్రేరేపితం చేసే విధంగా చర్యలు ఉండాలి
బీజేపీ బిఆర్‌ఎస్ బలహీన వర్గాలపైన చిత్తశుద్ధి ఉంటే శాసనసభలో బిల్లు చేసి చట్టబద్ధత చేసి కేంద్రానికి పంపిస్తాం
మీరు మీ పారదర్శకత నిరూపించుకోండి
తెలంగాణలో 56% బీసీలు ఉన్నారు 46% రిజర్వేషన్లు ఇవ్వడానికి చట్టబద్ధత కల్పిస్తాం
దానిని అడ్డుకోవడానికి లెక్కలు తప్పని బలహీన వర్గాలను అవమానించే విధంగా మాట్లాడుతున్నారు
కులగణన లో తెలంగాణ రోల్ మోడల్ గా దేశ మొత్తం ప్రభావితం చేస్తాం
మౌనంగా ఉండి బీసీల ఆగ్రహానికి లోను కాకుండా ఉండాలని కోరుతున్నా
కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు కేశవ రావు , సహచర మంత్రులు మా అందరికి స్ఫూర్తి ప్రదాత రాహుల్ గాంధీ గారు, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ దీపదాస్ మున్షి గారు అందరూ కలిసి గొప్ప చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు
రాష్ట్ర మంత్రిగా చరిత్రలో ఒక సామాజిక మార్పుకు నాంది కలిగే నిర్ణయం లో భాగస్వామ్యం అయ్యను
ఎవరితో వారంతా న్యాయం జరిగే విధంగా మా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు న్యాయం జరగబోతుంది
ప్రజలంతా సహకరించాలి వాస్తవానికి దగ్గరగా చెప్పే ప్రయత్నం చేయండి
గొప్ప చారిత్రాత్మక నిర్ణయం హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఇందుకు సంబంధించి నగర ప్రాంత ప్రజలు సహకరించలేధో వారంతా స్వచ్ఛందంగా తెలంగాణ జనాభాలో మీ లెక్క ఉండాలంటే సమాచారం ఉండాలంటే మీరు అందులో భాగస్వామ్యం కావాలని కోరుతున్నా
16 నుండి 28 మధ్య జరిగే ఈ ప్రక్రియలో పాల్గొనాలి
గతంలో కూడా గ్రామీణ ప్రాంతాల్లో దూదేకులా లాంటి ముస్లింలకు సంబంధించిన కులాలు బీసీల్లో ఉండేవి మనం కొత్తగా తెచ్చినవి కాదు
బీసీ జనాభా 56% వచ్చింది మేం 46% రిజర్వేషన్లు ఇస్తాం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వచ్చే విధంగా కేంద్రంలో మీ ప్రయత్నాన్ని కొనసాగించండి
బెషాజలలు విమర్శలు లేవు, మేం దినం మాకు ఇష్టం వచ్చినట్టు చేస్తామని అనడం లేదు అందరిని పిలిచి మాట్లాడుతున్నాం
1931లో స్వతంత్రం రాకముందు కుల సర్వే జరిగింది
మళ్లీ ఇప్పుడు మాత్రమే జరిగింది
Prev Post