రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 9 ఫిబ్రవరి 2025
మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని చిత్రపురి కాలనీలో భారత రాష్ట్ర సమితి మణికొండ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం ప్రభాకరరెడ్డి చిత్రపురి కాలనీలో రో హౌసెస్ కి వెళ్లడం జరిగింది. అక్కడ స్థానికుల అభిప్రాయ సేకరణ ప్రకారము రోడ్డులు మరియు నీటి సమస్య తీవ్రంగా ఉందని, ఇక్కడ రిజర్వాయర్ అవసరం ఎంతైనా వున్నదని, చిన్నపిల్లలకు కేటాయించిన టాట్ లాట్ ఆటస్తలంలో రో హౌస్ లు కట్టారని తెలియ పరుస్తూ, సొసైటీ బై లాస్ ప్రకారం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చెయ్యాలన్న వారు మాత్రమే ముందుకి రావాలని ఉదాహరణగా రోడ్డు వేయడానికి మున్సిపాలిటీ బడ్జెట్ కేటాయించిననూ వీరు అభ్యంతరం చెప్పినందు వలన రోడ్డుల దుస్థితి అలానే కొనసాగుతుంది,

అమ్మా పెట్టదు అడుక్కోనివ్వదు అనేచెందగా సొసైటీ ముందుకు సాగుతున్నది అని అనడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. మునిసిపాలిటీ అధికారులు కలుగ చేసుకొని మొత్తంగా వీధి వీధికి బంధో బస్తు సిమెంట్ రోడ్డులతో పాటు రో హౌస్ నుండి ఎల్.ఐ.జి వరకు రహదారినీ ఏర్పాటు చేయాలని, మార్గ మధ్యంలో ప్రభాకర్ రెడ్డి విగ్రహం దగ్గరలో క్వామ్బియాంట్ అమరాంతిన్ వారు ఎలక్ట్రిసిటీ హై టెన్షన్ వైర్ క్రింద గల స్థలాన్ని స్థానిక నాయకులు కూమ్ముక్కై వారి సహకారంతో తమ ప్రాజెక్టులో కలుపుకోవడం జరిగిన విషయం తెలియ పరచినారు, తదుపరి చిత్రపురి ఎల్.ఐ.జి, ఈ.డబ్లు.ఎస్ వేల్ఫేర్ అసోసియేషన్ ద్వారా 1912 ఫ్లాట్స్ గల సముదాయానికి వెళ్లడం జరిగింది అక్కడ స్థానిక వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల అభిప్రాయ సేకరణ ప్రకారం స్థానికంగా నీరు విద్యుత్షక్తి రోడ్ల నిర్వహణ సరిగానే ఉన్నదని, షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా వచ్చే ఆదాయం, దానిపై ఉన్న పై అంతస్తులో నిర్వహిస్తున్న బడి పిల్లల నెలసరి ఫీసులు మొత్తంగా ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ వాళ్ళు కైవసం చేసుకుంటున్నారనీ పిర్యాదు చేయడం జరిగినది, కావున ఇట్టి షాపింగ్ కాంప్లెక్స్ నిర్వహణ కూడా స్థానిక వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్లకి అప్పచెప్పితే బాగుంటుందని విన్నవించుకున్నారు. తదుపరి దాదాపు 40 లక్షల మునిసిపల్ బడ్జెట్ కమ్యూనిటీ హాల్ కట్టడానికి విడుదల చేసినను అట్టి మొత్తం ఏమైనదో కానీ నామ మాత్రపు అసంపూర్తి కట్టడం జరిగినది అని, ఇట్టి కట్టడం పూర్తి చెయ్యాలని స్థానికులు మొర పెట్టుకున్నారు. ఇక పోతే బస్తీ దవాఖాన పేరుకు మాత్రం ఉండగా సుస్తీ పడి సాగుతున్నదని స్థానిక ప్రజలు అభిప్రాయం వెల్లబుచ్చినారు, ఈ సందర్భముగా స్థానికులకు ఎల్ల వేళలా అండదండలుగా భారత రాష్ట్ర సమితి తరఫున మేముంటామని మనో ధైర్యంన్ని ఇవ్వడం జరిగినది, ఆపై సదరు అధికారులు సమస్యలపై స్పందించి వెంటనే కార్యరూపం చెయ్యాలని భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు డిమాండ్ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో కిరణ్, రమణ ముర్తి, బాలాజీ, గుట్టమీది నరేందర్, మల్యాద్రి నాయుడు, అందె లక్ష్మణ్ రావు, గోరుకంటి విఠల్, బండమీది మల్లేష్, ఉపేంద్రనాథ్ రెడ్డి, ఏర్పుల శ్రీకాంత్, యాలాల కిరణ్, రామ సుబ్బ రెడ్డి, సందీప్, సుమ నళిని, బోడ్డు శ్రీధర్, తిరుపతి, మహేందర్, కుంభగల్ల ధనరాజ్ తది తరులు పాల్గొని విజయవంతం కావించినారు.