రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 14 ఆగస్టు 2024:
మణికొండ అంతర్భాగమైన సెక్రటేరియట్ కాలనీ తిరుమల హిల్స్ గోల్డెన్ టెంపుల్ కూడలిలో ప్రతి బుదవారం చిరు వ్యాపారులు రోడ్డును ఆక్రమించడం వల్ల రాక పోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవు తున్నవని వీ ఆర్ 4 సాహ్యోగ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నార్శింగి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ దృష్టికి తేవడం జరిగినదని, సదరు అధికారి వెంటనే స్పందించి కానిస్టేబుల్ను పంపడం ద్వారా మునిసిపల్ అధికారులతో, తయి బజార్ వారితో మాట్లాడి పరిష్కార మార్గంగా కూడలి వద్ద ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు తగిన విధముగా ఏర్పాట్లు చేయడం జరిగిందని, ప్రజాభిప్రాయానికి విలువనిస్తు మసులుతున్న తాయి బజార్ వారికి, మునిసిపల్ అధికారులకు, ప్రత్యేకముగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మరియు వారి సిబ్బందికి మేనేజింగ్ ట్రస్టీ అందె లక్ష్మణ్ రావు ధన్యవాదములు తెలియపరుచడం జరిగినది.
Prev Post