ఉత్తమ ఫలితాలు సాధించిన మణికొండ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డ్స్ అందజేత..

 

మణికొండ మండల పరిషత్ ఉన్నత పాఠశాల ఒకటవ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులు 2023- 24 విద్యా సంవత్సరానికి గాను ఉత్తమ ఫలితాలు సాధించి విద్యలో ప్రతిభ చాటిన వారికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాంగ్య నాయక్ అధ్యక్షతన ప్రోగ్రెస్ కార్డ్స్ అందించడ మైనదని, ఈ పరిస్థితిలో విద్యార్థుల ఉన్నత చదువులకై ఏ విధమైనటు వంటి మెలుకువలు నేర్పించాలి, ఉన్నతమైన విద్యను అందించే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులతో ముచ్చటించడం జరిగినదని, అదేవిధంగా గత రెండు సంవత్సరాలుగా టీచ్ఫర్ ఇండియా ఎన్.జీ.ఓ సంస్థ వారు పాఠశాలకు ముగ్గురు ఉపాధ్యాయులను కేటాయించి విద్యా బోధన కల్పిస్తున్నారనీ, ఇందుకుగాను రెండు సంవత్సరాలు కాలం ముగియడంతో బోధకులు అయిన వర్షా రాణి, అనురాధ మరియు ప్రేమ్ కుమార్ లను పాఠశాల తరఫున ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికడం జరిగినది 2024-25 విద్యా సంవత్సరానికి గాను మణికొండ మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా నర్సరీ, ఎల్.కే.జి మరియు యూ.కె.జీ తరగతులను విద్యాశాఖ మంజూరు చేసిందనీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాల జిల్లా స్కూల్ ఆఫీసర్ మహమ్మద్ నజీర్ తెలుపుతూ ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపాలిటీ బీ.ఆర్.ఏస్ పార్టీ ఫ్లోర్ లీడర్ రామకృష్ణ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking