మణికొండ మునిసిపల్‌ కమీషనర్‌ ప్రదీప్‌ కుమార్‌ ని నిన్నటి రోజున మర్యాద పూర్వకంగా కలిసి వార్డ్‌ 8 మరియు అంతర్గతంగా చుట్టుప్రక్కల ఉన్న ప్రజా సమస్యలపై చర్చించడం

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 21 ఫిబ్రవరి 2024:
కొత్తగా వచ్చిన మణికొండ మునిసిపల్ కమీషనర్ ప్రదీప్ కుమార్ ని నిన్నటి రోజున మర్యాద పూర్వకంగా కలిసి వార్డ్ 8 మరియు అంతర్గతంగా చుట్టుప్రక్కల ఉన్న ప్రజా సమస్యలపై చర్చించడం దరిమిలా వెంటనే స్పందించి ఈ రోజున మున్సిపల్ డివిజనల్ అధికారిణి దివ్య జ్యోతి, అసిస్టెంట్ అధికారిణి మౌనిక, శానిటేషన్ ఇంజనీర్ సంపత్ ల తో కలసి విచ్చేసినారని ఆలస్యం నవీన్ కుమార్, మణికొండ వార్డు 8 వ కౌన్సిలర్ తెలుపుతూ నెక్నంపుర్ చిన్న చెరువులో ఉన్న గుర్రపు డెక్కని గతంలో సపర్యలు చేసి తీసుకున్న వారి కంటే ఎక్కువ డబ్బులు తీసుకుని సరి అయిన పని చెయ్యని ప్రవేట్ సంస్థ వారి విషయం ద్రుష్టికి తీసుకొని వెళ్లగా చెరువు మైంటైన్ చేస్తున్న వారిని పిలిపించి గుర్రపు డెక్కని వెంటనే తీయించమని సరిగా పనిచేయమని లేని ఎడల సమస్యలకు గురవుతారని హెచ్చరించి వారికి ఆజ్ఞాపించినాడని, పరిసర ప్రాంతాల వున్న హుడా లేఔట్ లో ఉన్న అవసర నిమిత్త స్థలాలు కొంత మంది కబ్జాకి ప్రయత్నిస్తున్నారని చెప్పగా అట్టి భూమిని మునిసిపల్ వారికి స్వాధీన పరుచమని పై అధికారులకు ఉత్తరం వ్రాస్తనని, 100 ఫీట్ల రహదారిలో ఉన్న వర్షపునీరు పోయే లైన్ పై మట్టి పోసి పూడ్చడం గురించి దృష్టికి తీసుకు వెళ్లగా అట్టి మట్టిని వెంటెనే తిపిస్తానని, మూడు సంవత్సరాల క్రితం శాంక్షన్ అయినను వెయ్యని రహదారిల వివరాలు చెప్పగా అట్టి కాంట్రాక్టర్స్ కి వార్నింగ్ లెటర్ పంపిస్తానని చెప్పడం జరిగినదని, అన్ని సమస్యలు సావద్దనముగా విని సమస్యలపై స్పందించిన మునిసిపల్ కమీషనర్ ప్రదీప్ కుమార్ కు ప్రజల తరపున ధన్యవాదములు తెలియ చేసినాను.

 

 

     

Leave A Reply

Your email address will not be published.

Breaking