రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 16 ఆగస్టు 2024:
మణికొండ పరిసర ప్రాంతంలో ముస్లిం స్మశాన వాటిక లేనందువలన ఇబ్బందులకు గురవుతున్నారని మైనారిటీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ సయ్యద్ జాఫర్ అహ్మద్ ప్రోద్బలంతో ది సిటిజన్స్ కౌన్సిల్ ఆద్వర్యంలో రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గ శాసన సభ్యుని కలసి పరిస్థితి వివరించగా వెంటనే ఏం ఎల్ ఎ స్పందించి కలెక్టర్ కు తెలుపగా జాయింట్ యాక్షన్ కమిటీ వారికి ది సిటిజన్స్ కౌన్సిల్ పూర్తి సహకారం అందించడం వలన ఎట్టకేలకు మణికొండ సర్వే నంబర్ 44 లో 5 ఎకరాల భూమిని ముస్లిం స్మశాన వాటికకు అల్లోట్ చేయమని స్థానిక తహసీల్దారుకు కలెక్టర్ ఆదేశించడమైనదని కౌన్సిల్ కార్యదర్శి షేక్ ఆరిప్ మొహమ్మద్ తెలుపుతూ ఈ విషయమై తోడ్పడిన ఏం ఎల్ ఏ, కలెక్టర్, సిటిజన్ కౌన్సిల్ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ, సహచర మిత్రులు ఉపేంద్రణధ్ రెడ్డి, ఆశిం మొహమ్మద్, సయ్యద్ ఫజల్, సముద్దీన్ సాహెబ్, తక్డీర్ భాషా, ఖాజా మొహిద్దిన్, ముఖ్ట్యార్ సాహెబ్, ఇబ్రహీం సాహెబ్, అందె లక్ష్మణ్ రావు తది తరులందరికి హృదయ పూర్వక శుభాభినందనలు తెలియ జేసినారు.