జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి సెప్టెంబర్ 19
జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో స్వచ్ఛతపై స్కూల్ విద్యార్థులతో శ్రమదానం కార్యక్రమం నిర్వహించి, విద్యార్థులతో స్వచ్ఛతపై మానవహారం నిర్వహించారు. ఈ సందర్బంగా మున్సిపల్ అధికారి హెల్త్ అసిస్టెంట్ మహేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా పరిశుభ్రత కోసం మీరు మీ కుటుంబ సభ్యులతో, మీ ఇంటి పక్కల వారితో కలిసి ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకుంటే అనారోగ్యాల భారిన పడకుండా రక్షించుకోవచ్చు అని అయన పలు సూచనలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ శ్రీకాంత్, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
