మున్సిపల్ కమిషనర్ ఎండి ఆయాజ్
జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి సెప్టెంబర్ 19
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని నాయిని చెరువు పరిసర ప్రాంతాలలో ఇటీవల జరిగిన గణపతి నిమర్జన ప్రాంతంలో ఉన్నటువంటి ప్లాస్టిక్ కవర్లు, పువ్వుల దండలు, కొబ్బరి చిప్పలు ఇతర చెత్తను తొలగించడం జరిగింది. ఈ సందర్భంగ మున్సిపల్ కమిషనర్ యండి ఆయాజ్ మాట్లాడుతూ నాయిని చెరువు పరిసర ప్రాంతాలలో బహిరంగ ప్రదేశాలలో మలమూత్ర విసర్జన చేసినట్లయితే జరిమానా తో పాటు చట్టపరమైన చెర్యలు తీసుకోబడునని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు ప్రజలు పాల్గొన్నారు.