మనోహరాబాద్ మండల్ ఏప్రిల్ 1న , తూప్రాన్ మండల్ ఏప్రిల్ 4 న బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం తప్పకుండా అందరూ హాజరు కావాలి. ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి
మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :-
మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్, మనోహరాబాద్ మండలాలలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎఫ్ డి సి చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. తూప్రాన్ ప్రభుత్వ అతిథి గృహంలో ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. మనోహరాబాద్ మండల కేంద్రంలో ఏప్రిల్ 1న, తూప్రాన్ మండలానికి సంబంధించి ఏప్రిల్ 4న పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు నిర్వహించుకోనున్నట్లు ప్రతాప్ రెడ్డి మీడియాకు తెలిపారు.
ఈ సమావేశంలో మాజీ ఫుడ్స్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ర్యాకల శేఖర్ గౌడ్, ,కిష్టారెడ్డి,ఫ్యాక్స్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి , మండల సర్పంచుల పొరము అధ్యక్షుడు భగవాన్ రెడ్డి, సర్పంచ్ పిట్ల పోచయ్య ముదిరాజ్, నవీన్, బిఆర్ ఎస్ పార్టీ తూప్రాన్ మండల ప్రధాన కార్యదర్శి పంజాల ఆంజనేయులు గౌడ్, సతీష్ చారి, సుధాకర్ రెడ్డి, వెంకటేష్ యాదవ్, నాగరాజు, వివిధ గ్రామాల సర్పంచ్ లు,ఎంపీటీసీ లు ప్రాజ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.