బి అర్ యస్ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శనీయం:

 

బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్..
వరంగల్ జిల్లా ప్రజాబలం ప్రతినిధి మార్చి 23:
దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలతో పాటు తెలంగాణ ఆడబిడ్డలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారని ప్రభుత్వ చీప్ ట్రిప్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. గురువారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని పోతన నగర్ రోడ్డులో టిఆర్ఎస్ పార్టీ 11 ,29 డివిజన్లలోని కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనాన్ని మణిద్వీప గార్డెన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ మేయర్ గుండు సుధారాణి తో కలిసి విచ్చేసిన ఆయన రెండు డివిజన్లలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ పేదింట్టి ఆడబిడ్డలకు ఒక తండ్రిలా షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. తెలంగాణ సాధించాక రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోతుందని పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధిలో ముందు వరుసలో నిలుస్తుందని అన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో కూడా చైర్మన్ సుందర రాజు యాదవ్, మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, హనుమకొండ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆజిజ్ ఖాన్, 11వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మి సురేందర్, రెండు డివిజన్ల పార్టీ అధ్యక్షులు, బూతు కన్వీనర్లు, నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking