జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి జనవరి 31
జమ్మికుంట మున్సిపాలిటీకి చెందిన 13 మంది కౌన్సిలర్లు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ చైర్మన్ అవినీతి పాలన నిధుల దుర్వినియోగం వలన విసుకు చెందడంతో గత నెల రోజుల క్రితం చైర్మన్ పై అవిశ్వాసం పెట్టిన కొన్ని కారణాల వల్ల అవిశ్వాసం దిగిపోయిందని పేర్కొన్నారు.
సీఎం సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక.
జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్స్ హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని విశ్వాసనీయా వర్గాల ద్వారా సమాచారం.