ఫిబ్రవరి 1వ తేదీన మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో మంత్రి పొంగులేటి పర్యటన

ఖమ్మం ప్రతినిధి జనవరి 31 (ప్రజాబలం) ఖమ్మం తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఫిబ్రవరి 1వ తేదీన గురువారం మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా మధ్యాహ్నం రెండు గంటలకు మహబూబాద్ లోని బాలాజీ ఫంక్షన్ హాల్లో రానున్న పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సి న విధివిధానాలపై ఎమ్మెల్యే, నియోజకవర్గ ముఖ్యనాయకులతో, సాయంత్రం నాలుగు గంటలకు డోర్నకల్ నియోజకవర్గం మరిపెడ బంగ్లాలోని వంటి కొమ్ము లక్ష్మారెడ్డి ఫంక్షన్ హాల్లో రానున్న పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సి న విధివిధానాలపై ఎమ్మెల్యే, నియోజకవర్గ ముఖ్యనాయకులతో సమావేశం అవుతారని తెలిపారు. కావున ఆయా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో ఆ సమావేశానికి హాజరు కావాలని దయాకర్ రెడ్డి కోరారు

Leave A Reply

Your email address will not be published.

Breaking