బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం సందర్భంగా పేద ప్రజలకు అన్నదానం.

 

దేవుడి ఆశీస్సుల తో బల్మూరి ఉన్నత పదవులు అధిరోహించాలి.

కాంగ్రెస్ పార్టీ జమ్మికుంట మండల అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు.

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి జనవరి 31:

దేవుడి ఆశీస్సులు ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కాంగ్రెస్ పార్టీ జమ్మికుంట మండల అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు జమ్మికుంట మాజీ జెడ్పిటిసి అరకాల వీరేశలింగం అన్నారు. ఎమ్మెల్సీగా బల్మూరి వెంకట్ బుధవారం ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా జమ్మికుంట పట్టణంలోని శివాలయంలో(బొమ్మల గుడి) కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జమ్మికుంట మండల అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు, మాజీ జెడ్పిటిసి అరకాల వీరేశలింగం మాట్లాడుతూ పేద ప్రజల కోసం విద్యార్థుల సమస్యల పరిష్కారానికి బల్మూరి వెంకట్ చేసిన కృషి వెలకట్టలేనిదని వారు కొనియాడారు. దేవుడి ఆశీస్సులు ప్రజల ఆశీస్సులతో బల్మూరి వెంకట్ రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెంది ఉన్నత పదవులు అధిరోహించాలని అన్నారు. బల్మూరికి ఎమ్మెల్సీగా ఎన్నిక కావడానికి ఆశీర్వదించి అండగా నిలిచి తోడ్పాటు అందించిన సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, దుద్దిల్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వరరావుతో పాటు మాజీ జెడ్పిటిసి అరకాల వీరేశలింగం బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొలుగూరి సదయ్య రాచపల్లి రమేష్ అధ్యక్షులు ఎస్సీ సెల్ జమ్మికుంట మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking