తూప్రాన్, డిసెంబర్, 25.ప్రాజబలం న్యూస్ :-
తూప్రాన్ పట్టణం లోని భారత్ పెట్రోల్ పంపు సమీపంలోని రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయంలో సోమవారం ఉదయం భుమన్నగారి నందంగౌడ్, సహదేవ్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, జానకిరామ్ గౌడ్, సాయిరాం గౌడ్ లు కుటుంబ సమేతంగా హాజరై సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణ ల మధ్య సత్యనారాయణ స్వామి ఐదు అధ్యాయాలు సంపూర్ణంగా భక్తి శ్రద్ధలతో వినుల విందుగా విని తరించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
