— దుర్గామాతనుదర్శించుకున్న
జిల్లా అదనపు కలెక్టర్, ఎస్పీ లు
మెదక్ నియోజకవర్గం ప్రజాబలం ప్రతినిధి :-
తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన ఏడుపాయల వన దుర్గ మాత సన్నిధి మాఘ అమావాస్యను పురస్కరించుకొని
జన జాతరగా మారింది. రాష్ట్రంలోని పలు జిల్లాల నుండే గాక మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల నుండి భారీ ఎత్తున భక్తులు చేరుకొని వేకువ జాము నుండే మాఘస్నానాలు ఆచరించి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్, జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి దుర్గామాత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. సింగూరు ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయడంతోభక్తుల సౌకర్యార్థం షవర్ బాత్ లను ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆలయ సిబ్బంది ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. టి ఎస్ ఆర్ టి సి బస్సులు పలు పట్టణాల నుండి ఏడుపాయలకు ఏర్పాట్లు చేయడం జరిగింది.అనంతరం ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. భక్తులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిస్థాయిలో పోలీస్ , ప్రత్యేక దళాలతోబందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
