అడ్వకేట్ జగన్ మోహన్
బిఎస్పీ నిర్మల్ జిల్లా ఇంచార్జీ
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన ప్రజాయుద్ధనౌక గద్దర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్న విధానం సమంజసం కాదని బిఎస్పీ నిర్మల్ జిల్లా ఇంచార్జీ అడ్వకేట్ జగన్ మోహన్ అన్నారు. భారతదేశ తొలి ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి పదవిని సైతం కించపరిచే విధంగా ఉన్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్థాయికి తగదని అన్నారు,విచక్షణారహితంగా మాట్లాడడం సరైంది కాదని జగన్ మోహన్ విమర్శించారు,ప్రత్యేకించి ఒకటే పార్టీకి సంబంధించిన వారికి ఇవ్వాలి అని చెప్పేసి రాజ్యాంగంలో ఉందా అని ప్రశ్నించారు!రాజ్యాంగము పై ప్రమాణము చేసి,రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మాట్లాడడం కేంద్రమంత్రి స్థాయికి తగదని అన్నారు,
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రతి ఒక్కరిని చైతన్యపరిచి చరిత్ర గద్దర్ గారిది అని కొనియాడారు,పద్మశ్రీ అవార్డులను,పద్మ విభూషణ్ అవార్డులను పారదర్శకంగా చేపట్టాలి కాని వివాదాలకు దారి తీసే విదంగా కేంద్రమంత్రి వైఖరి ఉన్నదని జగన్ మోహన్ విమర్శించారు