మఠం బ్రహ్మంగారి మఠంను కేంద్ర ప్రభుత్వం ప్రసాదం స్కీం వర్తింపజేయాలి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిని కర్రి వేణుమాధవ్
విశాఖపట్నం మార్చ్ 4 ();కేంద్ర పర్యటక శాఖ మాత్యులు జి కిషన్ రెడ్డిని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ ఇన్చార్జి కర్రి వేణుమాధవ్ మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం బ్రహ్మంగారి మఠం ని కేంద్ర ప్రభుత్వం ప్రసాదం స్కీం కింద ఏర్పాటు చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. కరోనా తర్వాత ప్రజలు శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి చెప్పిన కాలజ్ఞానాన్ని ప్రపంచంలో ఏ వింత జరిగిన బ్రహ్మంగారు చెప్పింది జరుగుతోందని మననం చేసుకుంటూ స్వామి వారి ఆశీర్వాదం కోసం బ్రహ్మంగారిమఠం వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుందని కుల మతాలకతీతంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని ప్రజలు దర్శించుకుంటున్నారని కనుక తమరు ఆధీనంలో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖ ద్వారా నిధులు కేటాయించే విధంగా చర్యలు చేపట్టాలని బీసీ కర్రి వేణు మాధవ్ విజ్ఞప్తి చేశారు.