హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజాబలం ప్రతినిధి డిసెంబర్ 21
ఆదివారం రోజున శ్రీనివాస రామాంజనేయుల జన్మదిన రోజున పురస్కరించుకొని రాష్ట్రీయ గణిత శాస్త్ర దినోత్సవంగా జరుపుకునే కార్యక్రమాన్ని జమ్మికుంట (ఇందిరానగర్)మైనారిటీ బాలికల పాఠశాల ( గర్ల్స్.1) విద్యార్థులు తేదీ 21 -12 శనివారం రోజున ముందస్తుగా గణిత శాస్త్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు విద్యార్థులు గణిత శాస్త్ర నైపుణ్యాన్ని ప్రధానోపాధ్యాయురాలు నదియా, కు ప్రదర్శించి వాటిపై వివరణలు ఇచ్చారు.ఇట్టి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నైపుణ్యాన్ని చాటుకున్న విద్యార్థులను ఉపాధ్యాయుల బృందం అభినందించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులతోపాటు ప్రిన్సిపల్ నదియా,కోఆర్డినేటర్ శ్రీవాణి, అశ్విని,గణిత ఉపాధ్యాయురాలు లావణ్య, సుస్మిత,హేమలత, పాఠశాల సిబ్బంది తదితరులు విద్యార్థులను అభినందించారు.