ప్రజా బలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా డిసెంబర్ 21:రాష్ట్రపతి పర్యటన విజయవంతంలో అధికారుల పాత్ర అభినందనీయం,
అధికారులను అభినందించిన మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం,
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన విజయవంతం చేయడంలో జిల్లా స్థాయిలోని అన్ని శాఖల అధికారుల పాత్ర ఎంతో అభినందనీయమని వారు ఎంతో బాధ్యతాయుతంగా వారి విధులు నిర్వహించారని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతంఅన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది శనివారంతో ముగియడంతో ఆమె ఢిల్లీకి బయల్దేరిన అనంతరం కలెక్టర్ గౌతం మాట్లాడుతూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 17న హకీంపేట విమానాశ్రయానికి చేరుకొన్నప్పటి నుంచి ఐదు రోజుల పాటు తిరిగి వెళ్ళేంత వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఒకరినొకరు సమన్వయం చేసుకొంటూ ఎంతో బాధ్యతాయుతంగా తమ విధులు నిర్వహించారని పర్యటన విజయవంతంలో వారి భాగస్వామ్యం ఎంతగానో ఉందని అభినందించారు. రాష్ట్రపతి రానున్న నేపథ్యంలో ఆయా శాఖల అధికారులకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో ఎంతో కృషి చేశారని తెలిపారు. అలాగే పోలీసు అధికారులు, సిబ్బంది , జిల్లా రెవెన్యూ శాఖ, సవాచార, రహదారులు, విద్యుత్తు, అటవీ శాఖ, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, సివిల్ సప్లయి, అగ్నిమాపక శాఖతో పాటు అన్ని శాఖల అధికారులు కలిసికట్టుగా పని చేయడం వల్లే రాష్ట్రపతి పర్యటన విజయవంతంగా ముగిసిందని ఈ విషయంలో పర్యటన ప్రారంభం నుంచి మొదలుకొని ముగిసేంత వరకు తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహించిన అధికారులు, సిబ్బంది అందరికీ కలెక్టర్ గౌతం అభినందనలు తెలిపారు