ప్రజాబలం ప్రతినిధి మేటర్ మల్కాజ్గిరి జిల్లా డిసెంబర్ 21:
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిదికై మంగళవారం హైదరాబాదుకు విచ్చేసిన సందర్భంగా, రాష్ట్రపతి పర్యటన విజయవంతంగా ముగంచుకొన శనివారం హకీంపేట విమానాశ్రయంలో ఢిల్లీకి బయల్దేరారు. తెలంగాణరాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, భారత గనుల మంత్రిత్వ శాఖ కిషన్ రెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు వేణుగోపాల్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకమారి, మేడ్చెల్ మల్కాజగిరి జిల్లా కలెక్టరు గౌతం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు ఘనంగా వీడ్కొలు పలికారు.