నిజాంపేట్ నివాస్ జర్నలిస్ట్ కాలనీకి నూతన కమిటీ ఎన్నిక…..

 

అధ్యక్షుడుగా తన్నీరు శ్రీనివాస్….

ప్రధానకార్యదర్శిగా కొలిపాక వెంకట్…

కోశాధికారిగా ఓర్సు లింగస్వామి…

(కుత్బుల్లాపూర్, ప్రజాబలం న్యూస్)
డిసెంబర్ 21 :
నిజాంపేట్ నివాస్ జర్నలిస్ట్ కాలనీ అసోసియేషన్ సర్వ సభ్య సమావేశం జర్నలిస్ట్ కాలనీ చర్ల ఎల్లమ్మ దేవాలయంలో శనివారం నిర్వహించారు. ఈ సర్వసభ్య సమావేశం లో కాలనీ సభ్యుల అందరి ఆమోదం మేరకు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా సీనియర్ జర్నలిస్ట్, రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్, కాలనీ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ జర్నలిస్ట్ టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకుడు కొలిపాక వెంకట్, కోషాధికారిగా సీనియర్ జర్నలిస్ట్, జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు ఓర్సు లింగస్వామిని ఏకగ్రీవంగా కాలనీ సర్వసభ్య సమావేశంలో ఎన్నుకున్నారు. వీరితో పాటు రాష్ట్ర వ్యవస్థపాక అధ్యక్షుడుగా టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, సలహాదారులుగా సీనియర్ జర్నలిస్ట్ లు గుంటూరు శేఖర్, దామర జగదీశ్వర్ గుప్తా, ఉద్దండపురం వెంకటేష్ గౌడ్, సిరిగిరి శ్రీనివాస్, నర్సింహా తో పాటు నిజాంపేట్ గ్రామ వాసులు టేకుల సుధాకర్ రెడ్డి, జీతయ్య, పెంటయ్యలు ఉన్నారు. అలాగే కాలనీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ గా సీనియర్ జర్నలిస్ట్ లు ముక్కర్ల లాలయ్య, నాగేంద్ర చారి, ఉపాధ్యక్షులుగా దేవేందర్ గుప్తా, శ్రీనివాస్, రాముయాదవ్, మల్లిఖార్జున్, జాయింట్ సెక్రటరీలుగా కృష్ణ, మారుతి కుమార్, కేవీవీ సత్యనారాయణ, పీ. శ్రీనివాస్ రావు, హబీబ్, ఈసీ మెంబర్స్ గా గోవింద్ రావు, కే. లక్ష్మణ్, కే. రమేష్, మహేష్, లక్ష్మణ్, మణి, శ్వేతశ్రీ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్బంగా నివాస్ జర్నలిస్ట్ కాలనీ అసోసియేషన్ కు నూతనంగా భాద్యతలు చేపట్టిన కమిటీ సభ్యులను పలువురు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking