గండిపేట మండలం ప్రజా బలం ప్రతినిధి 21 డిసెంబర్ 2024
మణికొండ భారత రాష్ట్ర సమితి నాయకులు కార్యకర్తలు పైప్ లైన్ రోడ్డులో గల పెట్రోల్ పంప్ సమీపం నుండి అంజలి గార్డెన్ వీదుల గుండా ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం పర్యవేక్షించడానికి కలసి కట్టుగా పాదయాత్రగా బయలుదేరడం జరిగినదని, ఈ దరిమిలా గత ఎన్నికల సమయంలో మాంచి పట్టుగా ఉన్న రోడ్డును అన్యాక్రాంతంగా మునిసిపల్ అనుమతులు మంజూరు ఉండీ లేకుండా ఒక బిల్డర్ రోడ్డు పగలగొట్టి డ్రైనేజీ వ్యవస్థను సమ కూర్చుకోవడం జరిగినదని స్థానిక ప్రజలు వాపోతున్నారు, అప్పటి నుండి మొదలుకొని అట్టి రోడ్డు బాగు చేయడం కొరకు మునిసిపల్ నిధులు దుర్వినియోగ పరుస్తూ కాంట్రాక్టర్లు రోడ్డు బాగు చేయడం అది కాస్త ముందుకు సాగి కొంచం దూరంలో కుంగి పోవడం, మళ్లీ బాగు చేయడం అదీ కాస్త కుంగి పోవడం సర్వ సాధారణ విషయమని ఇట్లాగ్గా పలు మార్లు జరిగినదని ప్రజాభిప్రాయ సేకరణలో తేట తెల్ల మైనదని, ప్రస్తుత పరిస్థితిలో రెండు మూడు చోట్లలో రోడ్డు పూర్తిగా కృంగి పోయినదని ఏ నిమిషములో ఏమి జరుగునో అని రహదారిన వెళ్లే వాహనదారులు భయ బ్రాంతులతో వాహనాలను నడుపుతున్నారని కావున సదరు అధికారులు ప్రమాదం జరుగక ముందే నిద్రావస్థ నుండి జాగృతులై తగిన చర్యలు తీసుకోవాలని, పై పెట్చ్చు సదరు అధికారులు తమకేమీ తెలియనట్లు ముందుకు సాగడం వింతగా వుందని స్థానిక ప్రజలు విస్మయం చెందుతున్నారని, ఇట్టి విషయమై సదరు అధికారులు సరి అయిన పద్దతిలో ఎంక్వయిరీ చేసి కాంట్రాక్టరు లను వెతికి పట్టుకొని చర్య తీసుకోవాలని భారత రాష్ట్ర సమితి పార్టీ మణికొండ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ డిమాండ్ చేస్తూ ప్రమాద ఘంటికలు మోగుతున్న స్థలంలో వెంటనే స్పందించి బాగు చేయించాలని లేని యెడల పై అధికారులను కలసి జరుగుతున్న విషయాలు వివరించ గలమని హెచ్చరించడం జరిగినది, ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో కౌన్సిలర్ ఆలస్యం నవీన్ కుమార్, సీనియర్ నాయకులు అందె లక్ష్మణ్ రావు, గుట్టమీది రాఘవేందర్, సంగం శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్, మల్యాద్రి నాయుడు, ఏర్పుల శ్రీకాంత్, యాలల కిరణ్, దిలీప్ కన్నకంటి, బొడ్డు శ్రీధర్, భానుచందర్, ప్రవీణ్, షేక్ ఆరిఫ్, సుమ, రేఖ, రమణమూర్తి తది తరులు పాల్గొన్నారు.