గ్రానైట్ టైల్స్ పాలిషింగ్ ఓనర్స్ అసోసియేషన్ ప్రమాణ శ్రీకర కార్యక్రమం హాజరైన మేయర్ సుడా చైర్మన్

 

ఖమ్మం ప్రతినిధి మే 25 (ప్రజాబలం) ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్ లోని రెస్ట్ ఇన్ హోటల్ నందు ఖమ్మం గ్రానైట్ టైల్స్ అండ్ పాలిషింగ్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథులుగా ఖమ్మం నగర మేయర్ పునుకోలు నీరజ బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఖమ్మం సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ గార్లు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం ఖమ్మం గ్రానైట్ టైల్స్ అండ్ పాలిషింగ్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ముఖ్య అతిథులకు శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.
కార్యక్రమంలో కార్పొరేటర్ నాగండ్ల కోటేశ్వరరావు ఖమ్మం గ్రానైట్ టైల్స్ అండ్ పాలిషింగ్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు మరియు గ్రానైట్ ఫ్యాక్టరీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking