మెదక్ 08/10/24 ప్రజాబలం న్యూస్ :-
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మెదక్ జిల్లా అకాడమిక్ సెల్ కమిటీ కన్వీనర్ గా శెగ్గరి అనిల్ గౌడ్ (ఎంపీపీఎస్ లింగ్సాన్ పల్లి హవేలి ఘనపూర్ మండలం),జిల్లా కో కన్వీనర్ లుగా ప్రసాద్ రెడ్డి ( జడ్.పి.హెచ్.ఎస్ కొత్తపల్లి -పాపన్నపేట మండలం), కన్వీనర్లుగా శంకర్ సింగ్ రాథోడ్ ( జడ్పిహెచ్ఎస్ చిలిపి చేడ్ -చిలిపి చేడు మండలం) ఎన్నికైనట్లు తపస్ మెదక్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం, చల్లా లక్ష్మణ్ తెలిపారు . ఈ సందర్భంగా వారు మెదక్ జిల్లాలో తపస్ అభివృద్ధికి కృషి చేస్తామని, రాష్ట్ర, జిల్లా నాయకుల ఆదేశాలు పాటిస్తామని వారన్నారు.